It is learned that the AP government has recently transferred IPS officer Madireddy Pratap. He was transferred as RTC MD and transferred as APSP Battalion DJ. However, Madireddy Pratap held a press conference after resigning as RTC MD. He made several key comments in this regard.
ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పై ఏపీ ప్రభుత్వం ఇటీవల బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను..ఏపీఎస్పీ బెటాలియన్ డిజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆర్టీసీ ఎండీగా బాధ్యతల నుంచి తప్పకుంటూ మీడియా సమావేశం నిర్వహించారు మాదిరెడ్డి ప్రతాప్. ఈ క్రమంలో ఆయన పలు కీలక కామెంట్స్ చేశారు.
వైఎస్సార్ హయాంలో తాను ఐటీ శాఖ కార్యదర్శిగా పని చేశానన్న ప్రతాప్.. ఆ సమయంలో కొందరు అధికారులను బదిలీ చేసిన ఫైల్స్ పై విచారణ జరిగిందన్నారు. అందులో తనని మాత్రం విచారించలేదని.. అది తన ఇంటిగ్రిటి అని ఉంటంకించారు. తన బదిలీని ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పిన ఆయన.. అనేక కారణాలతో తన బదిలీ జరిగి ఉండొచ్చని..
ఇలాంటివి సర్వసాధారణం అని చెప్పుకొచ్చారు.
ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు గల కారణాలు 7 రోజుల్లో చూపాలని నోటీసులో పేర్కొన్నారు. రిప్లై ఇవ్వని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని వెల్లడించారు. 'సర్వీసులో ఉన్న ఏ వ్యక్తీ ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా కామెంట్స్ చేయకూడదు' అనే నిబంధనను ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ మేరకు మాదిరెడ్డి ప్రతాప్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

0 Comments:
Post a Comment