కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. అధ్యయన కమిటీ ఏర్పాటు
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా పునర్ వ్యవస్థీకరణపై సీఎస్ నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 లోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయిచింది. జిల్లాల ఏర్పాటులో నేతల ప్రమేయం లేకుండా పూర్తి బాధ్యతలను అధికారులకే కట్టబెట్టారు. 25 జిల్లాలతో పాటు ప్రత్యేకంగా అరకు జిల్లా ఏర్పాటు అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే కొంత కసరత్తులు చేపట్టిన ప్రభుత్వానికి.. జిల్లాల నుంచి ప్రతిపాదనలు పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఐతే ప్రభుత్వం అనుకున్న దాని కంటే రెండు జిల్లాలు అదనంగా వస్తున్నట్లు సమాచారం. 2 గిరిజన జిల్లాల ఏర్పాటుకు డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
దాంతో మొత్తం ప్రతిపాదిత జిల్లాల సంఖ్య 27కి చేరినట్లు తెలుస్తోంది.గిరిజిన జిల్లాలపై స్పష్టత లేకపోవడంతో వాటిని పక్కనబెట్టారు. ఐతే ఈలోగా జనాభా గణన ప్రక్రియ తెరపైకి రావడంతో.. కేంద్రం ఫ్రీజింగ్ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అవరోధం ఏర్పడింది. ఐతే కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేపట్టవచ్చని, ఆ లోగా ఫ్రీజింగ్ గడువు కూడా తీరిపోతుందని ఉన్నతాధికార వర్గాలు రెవెన్యూశాఖకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాల ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది.

0 Comments:
Post a Comment