ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 3963 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 52 మంది కరోనా వల్ల చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒకేరోజు 994 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 550 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ గోదావరి (407), చిత్తూరు (343), నెల్లూరు (278), ప్రకాశం (266), అనంతపురం (220), గుంటూరు (214), శ్రీకాకుళం (182), కడప (145), కృష్ణా (130), విజయనగరం (118), విశాఖపట్నం (116) కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఏపీలో గడిచిన 24 గంటల్లోనే 52 మంది చనిపోయారు.
తూర్పుగోదావరి (12), గుంటూరు (8), కృష్ణా (8), అనంతపురం (7), పశ్చిమగోదావరి (5), ప్రకాశం (4), నెల్లూరు (3), విశాఖపట్నం (2), చిత్తూరు (1), కడప (1), విజయనగరంలో ఒక్కరు కరోనా వల్ల చనిపోయారు. జూలై 17వ తేదీ ఉదయం 9 నుంచి 18వ తేదీ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 23,872 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 12,84,384 టెస్టులు నిర్వహించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1411 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22260 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 21,763 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు.

0 Comments:
Post a Comment