Hero Cycles Cancels Deal With China: గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భంలో హీరో సైకిల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో చేసుకున్న 900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు. రాబోయే 3 నెలల్లో ఒప్పందం ప్రకారం చైనాతో 900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉందని.. కానీ ఈ ఒప్పందాన్ని తాము రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
'బాయ్‌కాట్ చైనీస్ ప్రాడక్ట్స్' నినాదంలో భాగంగా చైనా వస్తువుల బహిష్కరణలో తమ నిబద్ధతకు ఇదే నిదర్శనమని చెప్పారు. చైనీస్ కౌంటర్‌పార్ట్స్‌తో సంబంధాలను రద్దు చేసుకున్నామని, కొత్త మార్కెట్ల కోసం అన్వేషిస్తున్నామని పంకజ్ తెలిపారు.
యూరప్ మార్కెట్లను అందిపుచ్చుకునే ఉద్దేశంతో జర్మనీలో ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. హీరో ఎలక్ట్రో ఈ-సైకిల్ ప్రాజెక్ట్‌లో 72 శాతం షేర్లు భారత్‌వేనని తెలిపారు.
0 Comments:
Post a Comment