కేంద్రం కీలక నిర్ణయం.."ఉపాధి హామీ పథకం" జాబితాలోకి ఈ పనులు కూడా..!
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబితాలోకి కొత్తగా పారిశుధ్య పనులను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ఉపాధిహామీ కూలీలతో పనులు చేయించటానికి అనుమతిచ్చింది. అయితే ఈ నిర్మాణాలను ప్రభుత్వ పథకాలతో గాని లేదంటే ప్రత్యేకంగా నిర్మించుకోవచ్చని తెలిపింది. స్వచ్ఛభారత్ మిషన్ తో పాటుగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలకు సైతం అనుమతినిచ్చింది. కాగా ఇదివరకు ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చెరువుల పూడిక, మొక్కలు నాటడం వంటి పనులనే చేయించారు.
2006 లో ప్రారంభించిన ఈ పథకం కింద ఎంతోమంది పేద ప్రజలు లబ్దిపొందుతున్నారు.

0 Comments:
Post a Comment