కరోనా విధులపై పీఈటీల ఆవేదన
అధికారులు స్పందించాలని విన్నపాలు
కడప క్రీడలు, న్యూస్‌టుడే : మాకూ కుటుంబాలు ఉన్నాయి.. పిల్లలు ఉన్నారు.. ముఖ్యంగా బతుకు మీద ఆశ ఉంది. ఎవరూ పట్టించుకోవడం లేదని వ్యాయామ ఉపాధ్యాయులు బోరున విలపిస్తున్నారు. జిల్లాలో రెండు నెలలుగా కరోనా విధులు నిర్వహిస్తున్నాం.. ఇకనైనా విముక్తి లేదా అని రాష్ట్ర పీఈటీ, ఎస్‌ఏ పీఈ సంఘ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి జాతీయ పండుగలతో పాటు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ఇతరత్రా అన్ని పనులకు వ్యాయామ ఉపాధ్యాయులనే వాడుకుంటున్నారని సంఘం కార్యదర్శి ప్రవీణ్‌కిరణ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్, కరోనా కారణంగా 34 రోజులు రోడ్ల మీద విధులు నిర్వర్తించామని, మళ్లీ ఇప్పుడు 26 రోజుల నుంచి కొవిడ్-19 క్వారంటైన్‌ల వద్ద చాకిరీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా విముక్తి కల్పించాలని ఏ అధికారి మా గురించి పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులు కరోనా బారిన పడి చావుబతుకుల మధ్య భయంతో జీవనం గడుపుతున్నారని, అయినా ఏ అధికారి రిలీవ్ గురించి మాట్లాడం లేదన్నారు. గతంలో డీఈవో శైలజ 15 రోజులు క్వారంటైన్ విధులు పూర్తి కాగానే రిలీవ్ చేస్తామని మాట ఇచ్చారని, తర్వాత ఎటువంటి స్పందన లేదు. డీఈవో ఇచ్చిన మాట ప్రకారం వ్యాయామ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి బోధనా ఉపాధ్యాయులకు క్వారంటైన్ విధులను అప్పగించాలన్నారు. ఈ మేరకు ఈ నెల 21 తేదీన డీఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, డీఈవోకు వినతిపత్రం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులంతా పాల్గొంటున్నారని తెలిపారు.

0 Comments:
Post a Comment