ఏపీ పాఠశాలల్లో నేటి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ మొదలు
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సెప్టెంబరు 4 వరకూ అడ్మిషన్లు చేసుకోవచ్చిన పేర్కొంది. ఐదో తరగతి పూర్తి చేసిన వారిని ఆరో తరగతిలో చేర్చుకుంటారు. ఒక తరగతి నుంచి పైతరగతిలోకి ప్రమోట్ చేసే ప్రక్రియ కూడా చేపట్టవచ్చు. అయితే విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలి. వారి తల్లిదండ్రులను మాత్రమే రప్పించాల్సి ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు వారానికోసారి మాత్రమే పాఠశాలకు రావాలి. వారు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఈ మేరకు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసిన పాఠశాల విద్యా కమిషనర్ దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉపాధ్యాయుడు విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి. పాఠ్యాంశాల ఆన్‌లైన్ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్‌క్యాలెండర్‌లో సూచించిన పాఠ్యప్రణాళికకే పరిమితమై ఉండాలి. విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. ఆన్‌లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్), రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు(లోటెక్), కంప్యూటర్ గానీ మొబైల్ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని వారు (నోటెక్). గ్రామస్థాయిలోనూ, పట్టణాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లోనూ నివసిస్తున్న విద్యార్థులు ఎక్కువ మందికి ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేనందువల్ల ముఖ్యంగా వారిపైన దృష్టి పెట్టే విధంగా ఉపాధ్యాయుడు తన ప్రణాలికను తయారు చేసుకోవాలి. ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా చేయించాలి. 9,10 తరగతులకు విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు.
వారికి ఆన్‌లైన్, రేడియో ద్వారా శిక్షణ చేపట్టవచ్చు. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావాలి. ఇవి నాడు-నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి. ఇలా వచ్చేటీచర్లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఉపాధ్యాయుడు రోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి. వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి. ఉపాధ్యాయుడు తాను చేసిన రోజు వారీ పని వివరాలను ప్రతి శనివారం ఫొటో లేదా డాక్యుమెంట్ ఫార్మాట్‌లో గూగుల్ ఫారంలో అప్‌లోడ్ చేయాలి.

0 Comments:
Post a Comment