కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం నూతన విద్యా విధానం 2020కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్రం ఈ విధానంలో నాణ్యమైన విద్య విద్యార్థి హక్కు అని పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. ఇకపై ఉపాధ్యాయుల నియామకం కోసం టెట్ తో పాటు ఇంటర్వ్యూ తపనిసరి కానుంది. ప్రైవేట్ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల నియామకానికి సైతం ఇవే నిబంధనలు అమలవుతాయని కేంద్రం పేర్కొంది.
ఇంటర్వ్యూలో స్థానిక భాషలో వారికి ఉన్న ప్రావీణ్యాన్ని, నైపుణ్యాలను పరిశీలించి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రైవేట్ పాఠశాలల్లో టెట్ తో సంబంధం లేకుండానే విద్యా బోధన జరుగుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బీటెక్ చదివిన అభ్యర్థులు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
నూతన విద్యా విధానం అమలులోకి వస్తే టెట్ పాసైన వారు మాత్రమే పాఠాలు బోధించాల్సి ఉంటుంది.
కేంద్రం చదువులో భారతీయ కళలు, సంస్కృతి, వృత్తి విద్యలో భాగం చేస్తామని పేర్కొంది. ఆయా రంగాల్లోని నిపుణులను పాఠశాలలు నియమించుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నాణ్యమైన ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. టాలెంట్ ఉన్న విద్యార్థులు, డిగ్రీ+బీఈడీ పూర్తి చేసిన వారికి కేంద్రం పెద్ద సంఖ్యలో స్కాలర్ షిప్ లు ఇవ్వనుంది. అమ్మాయిలకు కేంద్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనుంది.
మరోవైపు నూతన విద్యా విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యావ్యవస్థలో సంస్కరణల గురించి కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. కేంద్రం 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలని చెబుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాళ్లకు వేగంగా ఉపాధి అవకాశాలు దొరికేలా కేంద్రం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.

0 comments:
Post a comment