న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ఒకప్పటి మేటి ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్ కూడా ఒకరు. భారత క్రికెటర్లలో 10వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ గవాస్కర్. అందుకే అభిమానులంతా సునీల్‌ను లిటిల్ మాస్టర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గవాస్కర్ చెత్త ఆటగాడంటూ భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మోరే ఈ వ్యాఖ్యలు చేశారు. 'మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను గవాస్కర్ దీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించేవాడు. కానీ నెట్స్‌లో మాత్రం ఒక్కో బంతిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడేవాడు. నెట్స్‌లో అతడి ఆటను చూస్తే అసలు ఇతడు బ్యాట్స్‌మనేనా అనే అనుమానం కూడా కలుగుతుంది.
నాకు తెలిసి నెట్స్‌లో అత్యంత చెత్త ఆటగాడు గవాస్కరే' అని మోరే చెప్పుకొచ్చారు.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం గవాస్కర్‌కు ఇష్టం ఉండదని, గవాస్కర్ నెట్స్‌లో ఆడే తీరుకు మైదానంలో ఆడే తీరుకు 99.9 శాతం వ్యత్యాసం ఉంటుందని మోరే చెప్పుకొచ్చారు. అయితే గవాస్కర్ గొప్ప ఆటగాడని, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బౌలర్లను సైతం అతడు ధైర్యంగా ఎదుర్కొనేవాడని చెప్పారు. ప్రపంచ క్రికెట్‌లో గవాస్కర్ ఓ అద్భుత ఆటగాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మోరే పేర్కొన్నారు.

0 Comments:
Post a Comment