The stalemate over the conduct of examinations for final year students under JNTU has been lifted. The varsity high command has decided to conduct the exams from September 9 to 30. Duties related to this will be posted on the varsity website on Monday.
పరీక్షలపై తొలగిన ప్రతిష్టంభన
సెప్టెంబరు 9 నుంచి 30 వరకు నిర్వహణ
జేఎన్‌టీయూ పరిధిలోని తుది సంవత్సరం విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన తొలగింది. సెప్టెంబరు 9 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ ఉన్నత యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను సోమవారం వర్సిటీ వెబ్‌సైట్లో పొందుపరుస్తారు.
ఎక్కడైనా పరీక్షలు రాయొచ్చు
కొవిడ్-19 కారణంగా విద్యార్థులు ఎక్కడైనా పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించారు. జేఎన్‌టీయూ పరిధిలో ఐదు జిల్లాల్లో విద్యార్థులు ఉన్నారు. ఎక్కడికక్కడ కళాశాలల్లో పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించారు. ఈ విధానం వల్ల విద్యార్థులు వసతి గృహాల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. దగ్గర ఉండే కేంద్రంలో పరీక్ష రాయవచ్ఛు ఈమేరకు ఆన్‌లైన్లో ప్రశ్నపత్రాన్ని పొందుపరుస్తారు.
బ్రాంచిల వారీగా..
జేఎన్‌టీయూ పరిధిలో ప్రతి రోజు పలు బ్రాంచిలకు పరీక్షలు నిర్వహించే వారు. తాజాగా ఒకరోజు ఒక బ్రాంచికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు సమూహంగా ఏర్పడే అవకాశం ఉండదు.
వేగంగా డిగ్రీ పట్టా అందజేత
వర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ తుది సంవత్సరంలో 18 వేలు, బీఫార్మసీ 2500, ఎంబీఏ, ఎంసీఏకు సంబంధించి 4500 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ పరీక్షలు పూర్తి చేస్తారు. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం చేసి, వేగంగా డిగ్రీలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. బ్యాక్‌లాగ్ ఉన్న విద్యార్థులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షలపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తామని ఉపకులపతి శ్రీనివాస్‌కుమార్ తెలిపారు.

0 Comments:
Post a Comment