మరోసారి ఎన్‌సీపీ స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా
కాఠ్‌మాండూ: నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. నేడు జరగాల్సిన భేటీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇలా ఈ సమావేశం వాయిదా పడడం ఇది ఐదోసారి. ప్రధాని ఓలీ, పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ మధ్య ఏర్పడ్డ తీవ్ర స్థాయి విభేదాలు పరిష్కారం కాకపోవడమే దీనికి కారణమని సమాచారం. ఇలా చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో పార్టీ చీలిక దిశగా సాగుతున్నట్లు వస్తున్న ఊహాగానాలు బలపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

0 Comments:
Post a Comment