ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను బలపేతం చేసేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. తాజాగా పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూల్స్‌లోని ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేసేందుకు నిర్ణయించారు. దానికితోడు పాఠశాలల్లో 8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్యాను అందించాలని, ఇంగ్లీష్ పై పట్టు పెంపొందించేందుకు టోఫెల్ తరహ పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇదిలావుంటే.. ప్రతి జిల్లాకు టీచర్ల కోసం ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వర్చువల్ తరగతులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఉన్నత పాఠశాలల్లోనూ లైఫ్ స్కిల్స్, కెరీర్ కౌన్సింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అయ్యేలా బోధన ఉండాలని ఆదేశించారు. మధ్యాహ్నా భోజనంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. వీటితో పాటుగా మరో నిర్ణయం సైతం తీసుకున్నారు. స్కూల్స్‌కు పక్కనే అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు లేవని, వాటన్నింటికి భవనాలను నిర్మించనున్నట్టు సీఎం చెప్పారు. అందుకు సంబంధించి ప్రాథమిక పాఠశాలల దగ్గర ఉండేందుకు సరైన స్థలాలు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే.. సెప్టెంబరు 5 నుంచి స్కూల్స్‌ను తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.

0 Comments:
Post a Comment