కొత్త ఫోన్ కొన్న ప్రతీ సారి మనకు ఓ కొత్త చార్జర్ వస్తుంది. దీంతో అనేక మంది ఇళ్లలో ఫోన్ల కన్నా చార్జర్లు అధికంగా కనిపిస్తాయి. అయితే కొత్త ఫోన్ కొన్న వినియోగదారులకు ఇక చార్జర్ లేకుండానే ఫోన్ అందించాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్ ఇవ్వడాన్ని నిలిపివేసిన మొబైల్ కంపెనీలు ఈ సారి ఈ కొత్త నిర్ణయం అమలుకు అడుగులు వేస్తున్నాయి. యాపిల్, శాంసంగ్ సంస్ధలు ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నాయి. రానున్న ఏడాది నుంచి వచ్చే కొన్ని ఫోన్ల బాక్సుల్లో చార్జర్లు లేకుండా అందించాలని శాంసంగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాపిల్ ఈ ఏడాదిలో తెచ్చే కొత్త తరం మొబైల్స్ నుంచే చార్జర్లు లేకుండా హ్యాండ్ సెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రెండు కంపెనీలు తీసుకున్న నిర్ణయం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఫోన్ల ప్యాకేజింగ్‌లో మార్పులు, రవాణాకు అయ్యే ఖర్చు, చార్జర్లను ఎక్కువగా తయారు చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే ఈ వేస్ట్ గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
0 comments:
Post a comment