కరోనా లాక్‌డౌన్ విద్యావ్యవస్థ అస్త్యవ్యస్తమైంది. 4 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడగా.. పదో తరగతి పరీక్షలు ఏకంగా రద్దయ్యాయి. ఐతే డిగ్రీ, పీజీ పరీక్షలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో యూనివర్సిటీలు, ఇతర సంస్థల్లో పరీక్షల నిర్వహణకు కేంద్రం హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శికి హోంశాఖ లేఖరాసింది. యూజీసీ గైడ్‌లైన్స్, యూనివర్సిటీల అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫైనల్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన స్లాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది.
కాగా, ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నత విద్య పరీక్షలను రద్దు చేసి.. పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడించాయి. ఐతే గుజరాత్ ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆ ప్రకటనపై యూటర్న్ తీసుకుంది. తాజాగా కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయా యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశముంది. వీలైనంత త్వరలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించవచ్చని తెలుస్తోంది.

0 Comments:
Post a Comment