ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో పర్యటిస్తున్న విషయం తెలియగానే చైనా ఉలిక్కిపడింది. ప్రధాని పర్యటనపై వెంటనే చైనా విదేశాంగశాఖ స్పందించింది. 'సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇప్పటికే ఇరుదేశాలు సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లో ఎవ్వరూ పాల్గొనకూడదు' అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ప్రకటించారు. మోదీ లద్దాఖ్ పర్యటనపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
ఇదిలా ఉంటే, గల్వాన్ ఘర్షణ అనంతరం అక్కడ నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోదీ ఈరోజు లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న తాజా పరిస్థితిని 14 కార్ప్స్ కమాండర్ ప్రధానికి వివరించారు. ఈ పర్యటనలో మోదీతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఉన్నారు.

0 Comments:
Post a Comment