మోటార్ వెహికల్ చట్టంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. ద్విచక్రవాహనాలకు సంబంధించి కొన్న రూల్స్ ను అమలులోకి తీసుకొచ్చింది కేంద్రం. బైక్ మీద వెనుక కూర్చునే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా పట్టుకునే విధంగా హ్యాండ్ హోల్డ్స్ తప్పనిసరిగా ఉండాలనే రూల్ ను తీసుకొచ్చింది. 100 సీసీ బైకుల్లో ఇవి కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడు అన్ని రకాల బైక్ లకు హ్యాండ్ హోల్డ్స్ ఉండలని కేంద్రం తెలియజేసింది.
అదే విధంగా వెనక కూర్చున్న వాళ్ళు పాదాలు పెట్టుకోవడానికి పెడల్స్, వెనుక టైర్ ఎడమవైపు భాగంలో సెక్యూరిటీ కవరింగ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన గెజిట్ ను రిలీజ్ చేసింది.
ఇకపై ఆర్‌టీవో కార్యాలయంలో మోటార్ సైకిల్ రిజిస్టర్ అవ్వాలంటే హ్యండ్ హోల్డ్స్, పెడల్స్, శారీ గార్డ్స్ కచ్చితంగా ఉండాలి.
0 Comments:
Post a Comment