ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక ముందు ప్రతి నెల 1 తేదీనే జీతాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి కూడా జీతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు.
సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్ సమర్పించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డేటాను పే అండ్ అకౌంట్ ఆఫీసర్లు పరిశీలించాల్సించి ట్రెజరీ అధికారులు ఫైనల్ చేయనున్నారు.p
సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్ సమర్పించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డేటాను పే అండ్ అకౌంట్ ఆఫీసర్లు పరిశీలించాల్సించి ట్రెజరీ అధికారులు ఫైనల్ చేయనున్నారు.p
0 Comments:
Post a Comment