కరోనా లాక్‌డౌన్ సమయంలో తన కస్టమర్ల నుంచి ప్రతీదానికి చార్జీలు వసూలు చేయకుండా వెసులుబాటు కల్పించిన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఆ తర్వాత ఈ నెల 1వ తేదీ నుంచి మళ్లీ ఛార్జీలను యథావిథిగా కొనసాగిస్తోంది.. దీంతో.. ఏటీఎం నుంచి ఎక్కువసార్లు డబ్బులు డ్రా చేసిన ఛార్జీలే, బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా వడ్డింపులే.. అయితే. ఇదే సమయంలో.. తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్బీఐ.. మరోసారి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) తగ్గించింది. ఎస్బీఐ.. ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం వరుసగా ఇది 14వ సారి కావడం మరో విశేషం. దీంతో.. వడ్డీ 5 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గిపోతుంది..
హోమ్ లోన్లపై వడ్డీ 5-10 శాతం తగ్గించుకోవచ్చు అన్నమాట.
ఇక, ఎస్‌బీఐ.. కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. మూడు నెలల కాల వ్యవధిపై ఇకపై 6.65 శాతం వడ్డీ అమలులో ఉంటుంది. అయితే కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి వడ్డీ రేట్లను రీసెట్ చేయించాల్సి ఉంటుంది. మరోవైపు... ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఈబీఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) తగ్గించింది ఎస్బీఐ.. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. 6.95 శాతం వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది... ఈ నెల 1వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి.
0 Comments:
Post a Comment