తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి... అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పాత సచివాలయ భవనాన్ని కూల్చేస్తున్నారు. సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో... తెలంగాణ ప్రభుత్వానికి ఈ అంశంలో అనుకూలమైన తీర్పు వచ్చింది. దీంతో సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... సచివాలయం వైపు వెళ్లే మార్గాలను మూసివేసి ఈ పనులు కొనసాగిస్తోంది.
ఈ నెలాఖరు నాటికి సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి... శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.
ఈ నెలాఖరు నాటికి సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి... శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.
0 Comments:
Post a Comment