ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. ఆ జీవోను నిలిపివేసిన హైకోర్టు
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి భూములను వెనక్కి తీసుకుంటూ జారీచేసిన జీవోపై స్టే విధించింది. తమకు కేటాయించిన 253 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వం అక్రమంగా, ఏకపక్షంగా జీవోను జారీచేసిందని పేర్కొంది. సోమవారం ఆ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు... ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రోశయ్య హయాంలోని గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం.. 2009లో అమర్ రాజా ఇన్‌ఫ్రా సంస్థకు చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నూనె గుండ్లపల్లి గ్రామాల్లో మొత్తం 483.27 ఎకరాలను కట్టబెట్టింది. ఆ ఒప్పందం ప్రకారం అమర్ రాజా కంపెనీ రూ.2,100 కోెట్ల విలువైన పెట్టుబడులు పెడతామని చెప్పింది. తద్వారా 20వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. కానీ అంత పెట్టుబడులు తీసుకురాక పోగా.. కేవలం 4,310 మంది మాత్రమే ఉపాధి కల్పించింది.ఐతే భూములు కేటాయించిన రెండేళ్లలో ఆ భూములను పూర్తిగా వినియోగించాల్సి ఉంటుందని ఒప్పందంలోనే ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ఉపయోగించకపోతే ఖాళీగా ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది. ఐతే అమర్ రాజా కంపెనీ మొత్తం 483.27 ఎకరాలకు గాను..229.66 ఎకరాలు మాత్రమే ఉపయోగించుకున్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగాల కల్పన లేకపోవడంతో పాటు సంస్ధ విస్తరణ కూడా చేపట్టకపోవడంతో ఖాళీగా ఉన్న 253 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటూ గత నెలలో ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసింది.

0 Comments:
Post a Comment