తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. తమిళనాడు వైద్యఆరోగ్యశాఖ విడుదలచేసిన కరోనా మీడియా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 4,329 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 64 మంది మరణించారు. తాజా లెక్కలతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,02,721కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 58,378 మంది కోలుకొని డిశ్చార్జి అవగా..1,385 మంది మరణించారు. తమిళనాడులో ప్రస్తుతం 42,955 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
తమిళనాడులో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికం చెన్నైలోనే ఉన్నాయి. చెన్నైలో ఇవాళ 2082 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ మహానగరంలో ఇప్పటి వరకు 64,689 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం చెన్నైలో 23,581 యాక్టివ్ కరోనా కేసులున్నాయని వైద్యాధికారులు తెలిపారు. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 35,028 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 4,329 మందికి పాజటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,70,720 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
0 Comments:
Post a Comment