కరోనా వైరస్ పేరు ఎత్తుతేనే అందరూ భయపడిపోతున్నారు. సామాన్యులే కాకుండా పలువురు రాజకీయ నాయకులు, నటులు, వీఐపీలు, పోలీసులు, వైద్య సిబ్బంది ఇలా అందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మహమ్మారికి సరైన వ్యాక్సిన్ రాకపోవడంతో.. ఇమ్యునిటీని పెంచుకోవడమే సరైన మార్గమని.. శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఈ ఇమ్యునిటీలో నిద్ర కూడా ఒక భాగమట. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతాయట. శరీరంలో వైరస్ బారిన పడిన కణాల్ని చంపేవి కూడా ఇవే. కాబట్టి నిద్ర తక్కువయ్యే కొద్దీ ఒంట్లో వైరస్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు వైద్యులు.
ఒకవేళ కరోనా సోకినా కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి. వైరస్ దరి చేరనీయకుండా ఉండేందుకు.. రోజుకీ హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోండి. అలా ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత మంచిదట. ఇక ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు అంటారా అయితే ఇలా చేయండి. ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండండి. రోజంతా చలాకిగా ఉంటారు. రాత్రి పూట నిద్ర బాగా పడుతుంది. మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. ఎందుకంటే రాత్రి నిద్ర పట్టదు కాబట్టి. రాత్రి నిద్రే మనిషి ఆరోగ్యానికి మంచిది. అలాగే కాఫీ, టీలు కూడా తాగడం తగ్గించాలి. అలాగే రాత్రి భోజనంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇక నిద్రపోయే ముందు పాలు లేదా మజ్జిగ తాగితే నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు వైద్యులు.
0 Comments:
Post a Comment