వేడి నీళ్లు లేనిదే స్నానం చేయలేని రోజులివి. ఎండాకాలంలో చన్నీటి స్నానం చేసినా...చలి, వర్షా కాలాల్లో మాత్రం వేడి నీళ్లు తప్పనిసరి. గీజర్లు లేదంటే స్టవ్‌పై నీటిని కాచుకొనైనా వేడి నీటితోనే స్నానం చేస్తారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా పట్టించుకోకుండా కొందరు హీటర్లు వాడతారు. వేడినీటితో స్నానంచేస్తే ఆ కొద్దిసేపు మాత్రమే హాయిగా ఉంటుంది. కానీ సాధారణ నీటితో స్నానం చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. చన్నీటి స్నానంతో లాభాలు తెలిస్తే ఇకపై వేడి నీళ్లతో అస్సలు స్నానం చేయరు.
చన్నీటితో స్నానం చేస్తే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రోగాలతో పోరాడే తెల్లరక్త కణాల సంఖ్య పెరుగుతుంది
ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు పనితీరు పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
చర్మ సంబంధిత వ్యాధులు రావు. స్కిన్ అలర్జీ తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
రోజూ చన్నీటి స్నానం చేయడంతో అధిక బరువును తగ్గించుకొని నాజూగ్గా మారవచ్చు.
చన్నీటి స్నానంతో పిల్లల్లో అవయవ వృద్ధి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ చన్నీటి స్నానం చేయాలని సూచిస్తున్నారు.
Good advice
ReplyDelete