అధికార పరిధిని దాటి ఆదేశించలేం: హైకోర్టు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనాతో మూతపడి ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం ఎలా అమలుచేస్తారని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించిం ది. మధ్యాహ్నభోజనం లేక పేద విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని బాలలహక్కుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలుచేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్‌చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. విద్యార్థులకు పౌరసరఫరాలశాఖ ద్వారా బియ్యం అందజేయాలని పిటిషనర్ తరఫున న్యాయవాది సీ దామోర్‌రెడ్డి కోరా రు. ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా 12 కిలోల బియ్యం, ఆర్థికసాయం కింద రూ.1500 అందజేస్తున్నదని, ప్రత్యేకంగా విద్యార్థుల కోసం పంపిణీ సాధ్యమవుతుందా?అని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగుతులు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరగా, దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబాల విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజయ్యేంత స్థోమత ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీచేయాలని తామె లా చెప్పగలమని, అది విధాన నిర్ణయమని, ప్రభుత్వం విచక్షణ మేరకు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొన్నది. అధికార పరిధి ని దాటి ఆదేశాలు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. డిమాండ్లపై విద్యాశాఖ మంత్రికి విన్నవించకుండా హైకోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది.
0 Comments:
Post a Comment