భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అంతకంతకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న రోనా కేసులతో ప్రజలందరూ క్షణ క్షణం భయం భయం గా బతుకుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని బ్రతుకు జీవుడా అంటూ దినదినగండంగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలోనే భారత ప్రజలందరి లో ఓ కొత్త ఊపిరి.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనుగొన్నాము అంటూ ప్రకటన చేసింది.
దీంతో అప్పటివరకు బతుకుతామో లేదో అనే అనుమానం తో ఉన్న అందరికీ..
భవిష్యత్తు పై ఆశ కలిగింది. అయితే భారత్ బయోటెక్ కనిపెట్టిన వ్యాక్సిన్ కు ప్రస్తుతం ఐసీఎమ్ఆర్ అనుమతితో దేశవ్యాప్తంగా పలుచోట్ల మనుషులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది భారత్ బయోటెక్ కనుగొన్న వ్యాక్సిన్. అయితే ప్రస్తుతం అందుతున్న కీలక సమాచారం ప్రకారం కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది వాలెంటర్ లను ఎంపిక చేసుకొని... వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి వారిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నారు.
ఈ వైరస్ క్లినికల్ ట్రయల్స్ లో ముందుగా ఒక వ్యక్తికి వ్యాక్సిన్ ఎక్కించి ఆ తర్వాత వైరస్ సోకేలా చేస్తారు. ఈ క్రమంలోనే యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి కరోనా వైరస్ ని చంపేయాలి. కాగా ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా సత్ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ముగ్గురిలో కరోనా వైరస్ యాంటీ బాడీలు కూడా ఉత్పత్తి అయినట్లు సమాచారం. ఇలా రెండోసారి కూడా వారం రోజుల వ్యవధిలోనే మరో సారి చెక్ చేస్తారు. అప్పుడు సత్ఫలితాలు వస్తే ఇక ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయినట్టే. అయితే మొదటి దశలో సత్ఫలితాలు అనేది నిజంగా శుభపరిణామం అనే చెప్పాలి.
0 Comments:
Post a Comment