ఫ్రాన్స్ నుంచి భారత్ బయల్దేరిన రాఫెల్ యుద్ధ విమానాలు... వైరల్ వీడియో...
శత్రుదేశాల ఆయుధాల్ని, విమానాల్నీ తుత్తునియలు చేసే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాఫెల్ యుద్ధవిమానాలు భారత్‌కి వచ్చేస్తున్నాయి. మొత్తం 36 యుద్ధ విమానాల్లో ఐదు విమానాలు... బుధవారం భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నాయి. ఇందుకోసం అవి ఫ్రాన్స్‌లోని ఇస్ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి ఇవాళ టేకాఫ్ అయ్యాయి. వీటిని నడుపుతున్నది భారత వాయుసేనకు చెందిన పైలెట్లే. ఇవి UAEలోని అల్ ధఫ్రా ఎయిర్‌బేస్ దగ్గర ఓసారి ఆగుతాయి. అక్కడ ఇంధనాన్ని నింపిన తర్వాత... తిరిగి భారత్ పయనమవుతాయి. మొత్తం ఐదు యుద్ధ విమానాలూ... ఇండియాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో బుధవారం ల్యాండ్ అవుతాయి. ఇవి మొత్తం 7364 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇండియా చేరతాయి.
ఇండియా చేరే రాఫెల్ యుద్ధ విమానాలను... లడఖ్ తరలించి అక్కడే మోహరిస్తారు. తద్వారా చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపుతారు. ఇండియా చైనా మధ్య ఇప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా సైన్యం వెనక్కి వెళ్లినప్పటికీ... సరిహద్దుల్లో కదలికలు ఇంకా ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియా దగ్గర ఉంటే... చైనాకు అంత శక్తిమంతమైన యుద్ధ విమానాలు లేవు. అందువల్ల ఇండియాదే పై చేయి అవుతుంది.
మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో రూ.58,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం... ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. వీటిని నడిపేందుకు ప్రత్యేక ట్రైనింగ్ కావాలి. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 12 మంది పైలట్లు ఈ ట్రైనింగ్ ఫ్రాన్స్‌లో పొందారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేలా డీల్ ఉంది. వారిలో ఎక్కువ మంది ఫ్రాన్స్‌లోనే ట్రైనింగ్ పొందనున్నారు.
కరోనా వైరస్ ఉన్నప్పటికీ... రాఫెల్ యుద్ధ విమానాల్ని షెడ్యూల్ ప్రకారమే డెలివరీ చెయ్యాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... జూన్ 2న కోరారు. ఆ ప్రకారమే... వాటిని ఇచ్చేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ముందుకొచ్చింది. (credit - twitter)
ఈ యుద్ధ విమానాలకు ఉన్న ఇంజిన్లు 11000 పౌండల ఫోర్స్‌తో పనిచేస్తాయి. అందువల్ల ఈ ఫైటర్ జెట్లు... గంటకు 1912 కిలోమీటర్లు వేగంతో వెళ్లగలవు. 3 డ్రాప్ ట్యాంకులతో 3700 కిలోమీటర్ల రేంజ్ వెళ్లగలవు. వీటిలో 16F జీరో జీరో ఎజెక్షన్ సీటు కారణంగా... జీరో స్పీడ్, జీరో ఆల్టిట్యూడ్‌లో కూడా ఆపరేషన్ చెయ్యగలరు. రాఫెల్‌లో ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు ఉంటాయి. అలాగే ఎయిర్-టు-గ్రౌండ్ మిస్సైళ్లు, ఎయిర్-టు-సర్ఫేస్ మిస్సైళ్లు ఉంటాయి. వాటితోపాటూ... అణ్వాయుధాలు కూడా ఉంటాయి. AESA రాడార్‌తో ఇవి దూసుకెళ్తాయి.
రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత వేగంగా స్పందిస్తాయి. చాలా వేగంగా దూసుకెళ్తాయి. ఆయుధాల్ని బలంగా పట్టుకుంటాయి. దాడి చేయడంలో వాటికి తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. మన దేశానికి వచ్చే విమానాల్లో 28 విమానాలకు సింగిల్ సీటు, 8 విమానాలకు డబుల్ సీటు ఉండబోతోంది. 15.27 మీటర్ల పొడవు ఉండే రాఫెల్‌కి రెక్క పొడవు 10.80 మీటర్లు ఉంటుంది. ఆయుధాలు లేని రాఫెల్ బరువు 9900 కేజీల నుంచి 10600 దాకా ఉంటుంది. టేకాఫ్ సమయంలో మాగ్జిమం 24500 కేజీల దాకా ఉండగలవు.

0 Comments:
Post a Comment