భూమివైపు దూసుకొస్తున్న ప్రమాదం: ప్రపంచం అప్రమత్తం...
ప్రపంచం ప్రస్తుతం కరోనాతో ఇబ్బందులు పడుతున్నది. కరోనా ఉగ్రరూపం దాల్చుతుండటంతో ఎలా కట్టడి చేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. సామాజిక భద్రత కరువైంది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ సమయంలో అమెరికన్ స్పేస్ ఏజెన్సీ మరో చేదు వార్తను మోసుకొచ్చింది. ఓ భారీ సైజులో ఉండే ఉల్కా భూమివైపు దూసుకొస్తున్నట్టు తెలిపింది. భూమివైపు దూసుకొస్తున్న ఈ ఉల్క 135 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నట్టు తెలిపింది. ఈ ఉల్క జులై 24 వ తేదీకి భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టుగా నాసా తెలిపింది.
సాధారణంగా ఇలాంటి ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత మండిపోయి చిన్న చిన్న ముక్కలుగా మారి భూమిపై పడుతుంటాయి.
అయితే, వాటి పరిమాణం బట్టి భూమికి ప్రమాదం ఉంటుంది. ఈ చిన్న చిన్న ముక్కలు భూమిని ఢీకోట్టినపుడు భూమిపై గుంతలు ఏర్పడతాయి. భూమిపై పడే మెటియోరైడ్స్ లో ఇనుము, నికెల్ వంటి ఖనిజాలు ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి మెటియోరైడ్స్ 500 వరకు భూమిపై పడుతుంటాయని, వీటి బరువు సుమారుగా 100 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, సముద్రాల్లో ఇవి ఎక్కువగా పడుతుంటాయని, నివాస ప్రాంతాల్లో మెటియోరైడ్స్ పడితే ప్రమాదం అని అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.

0 Comments:
Post a Comment