ఏపీ హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కలిశారు. హైకోర్టు తీర్పును గవర్నర్‌కు విన్నవించి వినతిపత్రం అందించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై మూడుసార్లు సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ను నియమించక పోవడంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని నిమ్మగడ్డను ఏపీ హైకోర్టు సూచించింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలిసిన తరువాత ఈ అంశంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న అంశం ఆసక్తికంగా మారింది.
ఇదిలా ఉంటే నిమ్మగడ్డ కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్ సర్కార్.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. - హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది.

0 Comments:
Post a Comment