ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో మరొన్ని కొత్త ఫీచర్లు వచ్చాయి. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్.. కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది.. గత వారమే వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS ఆధారిత యాప్‌లో animated stickers కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది.
ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నప్పుడు కంపెనీ తన వాట్సాప్ స్టోర్‌లో Playful Piyomaru అనే ఒక స్టిక్కర్ ప్యాక్‌ను చేర్చింది. ఈ లిస్టులో మరిన్నింటిని యాడ్ చేయాలని వాట్సాప్ భావిస్తోంది. ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ తన స్టోర్‌లో మరో 4 స్టిక్కర్ ప్యాక్‌లను చేర్చనుంది.
ఈ జాబితాలో Chummy Chum Chums, Rico's Sweet Life, Bright Days and Moody Foodies పేరుతో స్టిక్కర్లు ఉన్నాయి.
ఈ స్టిక్కర్ ప్యాక్‌లు Android, iOS ఆధారిత యాప్‌ల్లో రెండింటిలోనూ లభిస్తాయి. ఈ స్టిక్కర్లు వాట్సాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వాట్సాప్ స్టోర్‌లో యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలో యూజర్లకు అందుబాటులోకి వస్తాయని నివేదిక తెలిపింది.
వాట్సాప్‌లో కొత్త యానిమేటెడ్ స్టిక్కర్లను యాడ్ చేయడమే కాకుండా మెసెంజర్‌ను కూడా ఇంటిగ్రేట్ చేయనుంది. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌కు వాట్సాప్ ఇంటిగ్రేషన్‌ను తీసుకురావాలని భావిస్తోంది. గత ఏడాది, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ యాప్‌ల్లో interoperabilityని ప్రకటించింది.
ఈ ఆలోచన ఒక డెవలప్‌మెంట్‌ను మెసెంజర్ చాట్స్ రూపంలో చూశాము. మరొకటి మెసెంజర్‌లో వాట్సాప్ ఇంటిగ్రేషన్ అవుతుందని భావిస్తున్నారు. ఇతర వాట్సాప్ యూజర్లలో మెసేజ్‌లు, సర్వీసులను నిర్వహించడానికి ఫేస్‌బుక్ 'స్థానిక డేటాబేస్‌లో' కొన్ని పట్టికలను సృష్టిస్తోందని తెలిపింది.
వాట్సాప్ కాంటాక్ట్ బ్లాక్ చేస్తే.. పుష్ నోటిఫికేషన్ల సౌండ్స్, నిర్దిష్ట గ్రూపులోని మెంబర్స్ ప్రొఫైల్ పిక్చర్స్ వంటి వివరాలను కంపెనీని అనుమతిస్తుంది. చాట్ విషయాలు ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటాయి.
ఆయా వివరాలను గోప్యంగా ఉంచుతుంది. రెండు వేర్వేరు యాప్ యూజర్లను కూడా అనుమతిస్తుంది. మెసెంజర్, వాట్సాప్ ఆయా ప్లాట్‌ఫారమ్‌ల్లో నుంచే మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి డెవలప్ మెంట్ స్టేజ్‌లో ఉందని నివేదిక తెలిపింది.
0 Comments:
Post a Comment