ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి కలవరపాటుకు గురి చేసింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలపై ప్రభావం తీవ్రంగా పడింది. ప్రధానంగా విద్య, ఉపాధి రంగాలు కోలుకోలేకుండా అయ్యాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీవ్రమయ్యింది. దీంతో ఇటు ఉద్యోగుల్లోనే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్ పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం/ తులిప్ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనుంది. తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారెవరైనా ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) ద్వారా దీన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులకు పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం 23970 సంస్థల్లో దాదాపు మూడు లక్షల ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. తులిప్ 2025 సంవత్సరం నాటికి కోటి ఇంటర్న్‌షిప్స్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ అవకాశాన్ని కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే కల్పించింది.దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇండియన్స్ అయ్యి ఉండడంతో పాటు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీటెక్, బీఆర్క్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, ఎల్ఎల్‌బీ తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యి 18 నెలల లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు పూర్తి వివరాల కోసం https://internship.aicte-india.org/module_ulb/Dashboard/TulipMain/index.php లింకును సందర్శించవచ్చు.
0 Comments:
Post a Comment