న్యూ ఢిల్లీ: కొవిడ్ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతబడ్డాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్ చదువులకు ప్రాధాన్యతనిస్తున్నారు. కాగా, ఈ పరిణామం 'డిజిటల్ విభజన'కు దారితీస్తుందేమోనని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితి రాకుండా తమ ప్రభుత్వం కొత్త విద్యా నమూనాను అమలు చేయబోతున్నదని ప్రకటించారు. ఇది 'చేరుకోవడం.. కనెక్ట్ అవడం..' పై దృష్టిసారిస్తుందని చెప్పారు. పిల్లలు పాఠశాలలకు రాకున్నా మానవ అనుభూతితో పాఠ్యాంశాలు నేర్చుకునేలా తాము కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఉపాధ్యాయులు వాట్సాప్ లేదా రెగ్యులర్ ఫోన్ కాల్స్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంటారని సిసోడియా చెప్పారు.
వీటి ద్వారానే అసైన్‌మెంట్స్ ఇస్తారని, రెగ్యులర్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని వివరించారు. అలాగే, కేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు రోజువారీ పనిని తరగతి ఉపాధ్యాయుల నుంచి వాట్సాప్ ద్వారానే పొందుతారని తెలిపారు. వాట్సాప్ లేదా స్మార్ట్‌ఫోన్ లేని వారితో టీచర్లు సాధారణ ఫోన్‌ద్వారా కనెక్ట్ అవుతారని వివరించారు. మరోవైపు, 11, 12 తరగతుల విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించనున్న ప్రత్యక్ష ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతారని పేర్కొన్నారు. వారి సందేహాలను ఉపాధ్యాయులు ఫోన్‌కాల్ లేదా వాట్సాప్ ద్వారా నివృత్తి చేస్తారని వివరించారు. కొవిడ్-19 కారణంగా విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోకుండా తమ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా పేర్కొన్నారు.

0 Comments:
Post a Comment