దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే.. డి-విటమిన్ లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సమృద్ధిగా డి-విటమిన్ ఉన్న వారికి కరోనా వచ్చినా.. త్వరగానే కోలుకుంటున్నట్లు తేలింది. నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్ లోపం ఉంటుందని పలు సర్వేలు తెలుపుతున్నాయి.
కాగా.. గ్రేటర్ వాసులే ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం గమనార్హం. డి-విటమిన్ తక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
కరోనా మృతుల్లో అధిక శాతం వారేనని, డి-విటమిన్ సమృద్ధిగా ఉన్న వారు త్వరగా కోలుకుంటున్నారని ఆయన చెప్పారు.
0 Comments:
Post a Comment