అమరావతి : సిలబస్ పై కసరత్తు
రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం కోసం సిలబస్ రూపకల్ప నపై విద్యాశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ల(బోధనా నిపుణులు)ను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించింది. కరోనా లాక్‌డౌన్, వైరస్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో ఈపాటికే విద్యా సంవత్సరంపై స్పష్టత రావాల్సి ఉన్నా.. వాయిదానే కొనసాగు తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు మూడో తేదీ నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ.. మరోవైపు కేంద్రం ఆగస్టు 15 తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసింది. ఇదిలా ఉండగా.. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభ మైనా సిలబస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. అందుకోసం పనిదినాల తగ్గింపుతోపాటు సిలబస్ కరిక్యులమ్‌ను కూడా కుదించాలని నిర్ణయించింది.
విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ కూడా విద్యా సంవత్సరం నష్టపోకుండా.. సిలబస్‌ను తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో బోధనా నిపుణుల ద్వారా సిలబస్ విషయంపై కసరత్తు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో సబ్జెక్ట్ నిపుణులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. బోధనా నిపుణులను గుర్తించే బాధ్యతను జిల్లాల విద్యాశాఖాధికారులు తీసుకోవాలని, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. టెక్ట్స్ బుక్, కరిక్యులమ్ డెవలప్‌మెంట్, అనువాద నైపుణ్యాలున్న ఉపాధ్యాయులను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించాల్సి ఉంది. అలాగే విద్యారంగంలో కొత్త విధానాలను, ఆవిష్కరణల్లో పాలుపంచుకున్న నిపుణులను గుర్తించనున్నారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ రూపొందించే, వర్చ్యువల్ టీచింగ్, ప్రాజెక్ట్స్, మోడల్స్, రిఫరెన్స్ పుస్తకాలు ఎంపిక చేయాల్సి ఉన్న నేపథ్యంలో అందులో ప్రవీణులైన అధ్యాపకులను గుర్తించనున్నారు. పుస్తక రచయితలు, ఈ కంటెంట్ క్రియేషన్(వీడియో, ఆడియో లెసన్స్, బొమ్మలు గీయడం, ప్రశ్నాపత్రాలు రూపొందించడం తదితరాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు కూడా తమ వివరాలను ఈ నెల 20లోపు నిర్దిష్ట ఫార్మేట్‌లో అందజేయాలని కమిషనర్ సూచించారు. ప్రతి సబ్జెక్టులో కనీసం పది మంది బోధనా నిపుణులను గుర్తించాలని, అలాగే ఇప్పటికే ఆ దిశగా రూపకల్పన చేస్తున్న వారిని సంప్రదించాలని భావిస్తున్నారు.

0 Comments:
Post a Comment