AP Grama Sachivalyam Exams 2020: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టులకు పరీక్షలను ఆగష్టు 9-14 వరకు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అటు లాక్ డౌన్ కారణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది అభ్యర్థులు సొంతూళ్లకు వెళ్లిపోగా.. వారికి ఎగ్జామ్ సెంటర్లను మార్చుకునే అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పంచాయతీరాజ్ శాఖ మరోసారి పొడిగించింది. గతంలో విధించిన గడువు తాజాగా ముగియడంతో.. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వారుంటున్న చోటే పరీక్షా కేంద్రాలను ఎంచుకోవచ్చునని అధికారులు వెల్లడించారు.
కాగా 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.
I want job in ap sachivalayam
ReplyDelete