ఒకే దేశం-ఒకే బోర్డుతో అదనపు బరువు పెంచొద్దని వ్యాఖ్యలు
చిన్నారులపై కనికరం చూపాలన్న జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం
దిల్లీ: విద్యార్థుల కోసం 'ఒకే దేశం-ఒకే బోర్డు' ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే చిన్నారుల బడి సంచి బరువు పెరిగిందని వ్యాఖ్యానించింది. వాటిని మోయలేకే వారి వెన్ను విరిగిపోతోందని ఇంకా అదనపు బరువు వేయొద్దని సూచించింది. వారిపై కనికరం చూపాలని పిటిషనర్‌ను కోరింది.
దేశమంతా విద్యార్థులందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవ్యాది పిల్ దాఖలు చేశారు.
ఇందుకోసం దేశమంతటా ఉమ్మడి బోర్డు ఉండాలని కోరారు. ప్రస్తుతం ఆ వ్యాజ్యాన్ని విచారించలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
'ఇప్పటికే మన చిన్నారులు బరువున్న సంచులు మోస్తున్నారు. ఆ బరువుకే వారి వెన్ను విరిగిపోతోంది. వారిపై మీరెందుకు అదనపు బరువు మోపాలని అనుకుంటున్నారు?' అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. పిల్లలపై కనికరం చూపాలని, అదనపు బరువు పెట్టొద్దని సూచించింది. దేశమంతటికీ ఉమ్మడి విద్యా బోర్డు, ఉమ్మడి పాఠ్య ప్రణాళిక అనేవి విధానపరమైన చర్య కిందకు వస్తాయని తెలిపింది.
'మీరు కోరినవన్నీ విధానపరమైనవి. అన్ని బోర్డులను కలిపేయాలని, ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలని మేమెలా చెబుతాం? ఇది బోధించండి.. అది బోధించండి అని చెప్పడం కోర్టుల పని కాదు' అని ధర్మాసనం పేర్కొంది. వేర్వేరు బోర్డులు వేర్వేరు పాఠాలను చెబుతున్నాయని పిటిషనర్ అనడంతో 'దేశంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించేందుకు వేర్వేరు సిలబస్ ఉండొచ్చు. పిల్లలను నేర్చుకున్నంత నేర్చుకోనివ్వండి' అని వెల్లడించింది.
తాను నొక్కి చెప్పినవన్నీ ముఖ్యమైనవే అని ఉపాధ్యాయ్ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. 'ముఖ్యమే కావొచ్చు కానీ న్యాయపరమైనవి కావు. వేలాది అంశాలు కీలకమే కావొచ్చు కానీ న్యాయపరమైనవి కాకపోవచ్చు' అని పేర్కొంది. విధానపరమైన అంశాలకు కోర్టును వేదిక కానీయమని సంబంధిత అధికారులను కలిసే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

0 Comments:
Post a Comment