ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వం నుంచి పంపే నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షకు ధరలు. ధరలు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీచేసిన వైద్యారోగ్యశాఖ. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే పరీక్షకు రూ.2800 ధరను ప్రభుత్వం నిర్దారించింది. ఈ మొత్తంలోనే ర్యాపిడ్ కిట్‌తోపాటు పీపీఈ కిట్లు ఉంటాయన్న ప్రభుత్వం తెలిపింది. మానవవనరుల వ్యయం కూడా కలిపి ఉంటుందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆసక్తి ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు దరఖాస్తు చేయాలన్న ప్రభుత్వం తెలిపింది.
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ధరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వంతోపాటు ఐసీఎంఆర్‌కు కూడా పరీక్షల ఫలితాలు అప్‌లోడ్ చేయాలని సూచించింది. ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్‌లలో పరీక్షలు, ధరలపై పర్యవేక్షించాలని ఆదేశం చేసింది.
0 Comments:
Post a Comment