Change In Telangana Inter Board Exam Pattern: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్షల ప్రశ్నాపత్రాల రూపకల్పన, మార్కుల కేటాయింపు వంటి అంశాలపై ఇటీవలే ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే 2020-21 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని యోచిస్తోంది.
ఈ సరికొత్త విధానంలో ఇక నుంచి ఇంటర్‌లో మూడు ఆన్లైన్ పరీక్షలు జరగనున్నట్లు తెలుస్తోంది.
40 శాతం మార్కులకు మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఉండేలా అధికారులు ప్రతిపాదించారట. ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తే.. జవాబు పత్రాల మూల్యంకనానికి సమయం తక్కువ పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మూడు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి.. వాటిల్లో అత్యధిక మార్కులు వచ్చిన రెండింటిని సగటుగా తీసుకుని తుది మార్కులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అలా వచ్చిన మార్కులను ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇంటర్నల్స్‌కు 20 శాతం, తుది పరీక్షలకు 40 శాతం మార్కులు ఉండేలా అధికారులు ప్రతిపాదించారు. మరి దీనిపై ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందో లేదో వేచి చూడాలి.!
0 Comments:
Post a Comment