విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. కాలేజీల్లో విద్యార్థుల డ్రాపౌట్స్‌ను నియంత్రించడం.. పౌష్టికాహారాన్ని అందించేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయించారు. చాలామంది విద్యార్థులు ఉదయం కాలేజీలకు వచ్చి.. లంచ్ బాక్సు తెచ్చుకోకపోవడం వల్ల మధ్యాహ్నామే ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్నా భోజనం పెట్టాలని భావించినట్టు కేసీఆర్ ప్రకటించారు.
ఇదిలావుంటే.. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే. దీనికితోడు జడ్చర్లలో ఏర్పాటు చేయనున్న బొటానికల్ గార్డెన్‌కు కావాల్సిన రూ.50 లక్షలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమావేశమై గార్డెన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కోరారు.ఇదే సమయంలో జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్నా భోజనం పెడుతున్నారన్న విషయం తెలుసుకున్న కేసీఆర్ వారిని ఎంతగానో అభినందించారు. అందులో భాగంగానే లెక్చరర్ రఘురామ్ వినతి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త భవనం సైతం మంజూరు చేశారు. ఈ సమయంలోనే తెలంగాణ నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను సీఎం కేసీఆర్‌కు సదాశివయ్య బహుకరించడం గమనార్హం.

0 Comments:
Post a Comment