ఎయిడెడ్ స్కూళ్ల బలోపేతమెలా?
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతూ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ఎయిడెడ్ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పాఠశాల విద్య డైరెక్టర్(పరిపాలన) పి.పార్వతి నేతృత్వంలోని కమిటీ గురువారం ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్‌మెంట్లు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విద్యార్థులు లేక మూతపడుతున్న, తక్కువ మంది విద్యార్థులతో కునారిల్లుతున్న పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలో చెప్పండని కమిటీ కోరింది.
అయితే, ఎయిడెడ్ స్కూళ్లు, టీచర్ల విలీనం కోసం ఈ సమావేశం పెట్టలేదని, ఆ పాఠశాలలను ఎలా బలోపేతం చేయవచ్చో అభిప్రాయాలు మాత్రమే సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ పేర్కొనడం గమనార్హం.
ఇకపై ఎయిడెడ్‌లో పాఠశాలలను నిర్వహించలేమని ప్రతి జిల్లాలోని కొన్ని మేనేజ్‌మెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాశాయని కమిటీ తెలిపింది. ఎయిడెడ్ స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ టీచర్స్ గిల్డ్(ఏపీటీజీ) ఈ కమిటీ దృష్టికి తీసుకొచ్చింది. ఎయిడెడ్ స్కూళ్ల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై 10 రోజుల్లో అభిప్రాయాలు తెలియజేయాలని మేనేజ్‌మెంట్లను కమిటీ కోరింది.

0 Comments:
Post a Comment