ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ కేసులు ఏకంగా 50 వేలు దాటాయి. ప్రస్తుతం ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 53,724 ఉండగా, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 696 మంది మరణించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలు, అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ఐసీఎంఆర్ సూచించిన ఔషధాలపై ఉన్న ఎంఆర్పీ రేట్లనే వసూలు చేయాలని స్పష్టం
- అవసరం లేకపోయినా ఈ ఔషధాల అదనపు డోసులు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అస్పత్రులకు స్పష్టం చేసిన ప్రభుత్వం
- ఊపిరితిత్తుల్లో కోవిడ్ వైరస్ తీవ్రత తెలుసుకునేందుకు వినియోగించే సీటీ స్కాన్‌కూ గరిష్టంగా 2500 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం
- ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదు అయి ఉన్న ఆస్పత్రులన్నీ ఈ ఔషధాల వినియోగానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
- ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు గతంలో ప్రభుత్వం సూచించిన ప్యాకేజీ ధరలకు అదనంగా అందించే చికిత్సను అనుసరించి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని స్పష్టం
- ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఛాతీ ఎక్స్ రే, సీటీ స్కాన్‌లో ఉన్న మార్పులకు అనుగుణంగా కోవిడ్ పాజిటివ్ రోగిగానే గుర్తించి ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని సూచించిన ప్రభుత్వం
- ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు కోవిడ్ చికిత్స కోసం రోగుల నుంచి ప్రభుత్వ సూచించిన ధరల కంటే అదనంగా వసూలు చేయకుండా చూడాలని జిల్లా వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు
- గతంలో కోవిడ్ క్రిటికల్ కేర్ చికిత్సకు మందులు, పరీక్షలు ఆహారం సహా రోజుకు 5480 నుంచి 10,380 రూపాయల వరకూ నిర్ధారించిన ప్రభుత్వం
- నాన్ క్రిటికల్ కేర్‌కు రోజుకు 3250 చొప్పున మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది ఏపీ సర్కార్.

0 Comments:
Post a Comment