అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు... ఇవి రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోనే ఉన్నాయా? అలాంటి చట్టాలు చే సే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అనే అంశాలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ న్యాయ సలహా కోరినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తన ఆమోదం కోసం పంపించిన మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను సోమవారం ఆయన ప్రభుత్వ న్యాయ విభాగానికి పంపించారు. ఈ రెండు బిల్లులపై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా న్యాయ సలహా ఇవ్వాలని కోరారు. అమరావతికి మంగళం పలికే మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దుపై ఇప్పటికే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ రెండు బిల్లులు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమనే అభిప్రాయం కూడా ఉంది.
మరోవైపు... వీటిని శాసనమండలి తిరస్కరించలేదని, సెలెక్ట్ కమిటీలో ఉండగానే శాసనసభ మరోసారి ఆమోదించి గవర్నర్‌కు పంపడం కుదరదనే వాదన కూడా ఉంది. మరోవైపు... ఈ బిల్లులను ఆమోదించవద్దంటూ గవర్నర్‌కు విపక్షాలు, ప్రజా సంఘాలు లేఖలు రాశాయి. ఇలా న్యాయ, శాసన పరమైన చిక్కులు, సందేహాలు ఉన్నందునే గవర్నర్ వీటిపై న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ వాదన ఇలా...
మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దుపై ప్రభుత్వం తన వైఖరిని సమర్థించుకుంటోంది. శాసనసభలో రెండోసారి ఆమోదం పొందిన ఈ బిల్లుల్ని మరోసారి శాసనమండలిలో ప్రవేశపెట్టి నెలరోజులు గడిచి పోయిందని... అందువల్ల అవి 'ఆటోమేటిక్'గా ఆమోదం పొందినట్లేనని అధికార పార్టీ చెబుతోంది. శుక్రవారంతో నెలరోజుల గడువు ముగిసిపోయింది. శనివారం ఆ రెండు బిల్లుల్ని గవర్నర్ ఆమోదానికి పంపించారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులు గవర్నర్ వద్దకు వెళ్లడం, ఆయన ఆమోదం తెలపడం సర్వసాధారణంగా జరుగుతుంది. అలాగే ఈ బిల్లులను కూడా రొటీన్‌గా ఆమోదించి పంపాలని గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ... అలా చేయవద్దు అని టీడీపీ, బీజేపీ ఇతర పార్టీలు గవర్నర్‌ను కోరాయి. ''రూల్ 71కింద మండలి ఆ బిల్లుల్ని ఆమోదించలేదు. అందువల్ల, అవే బిల్లుల్ని యథాతథంగా మళ్లీ శాసనభలో ప్రవేశపెట్టేందుకు వీల్లేదు. ఇవి శాసనమండలి సెలక్ట్ కమిటీ పరిధిలో ఉన్నాయి. అదే సమయంలో అమరావతి రాజధాని అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది'' అని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టంలో ఒక్క రాజధాని గురించి మాత్రమే ఉందని, మూడు రాజధానుల ప్రస్తావన లేదని చెబుతున్నారు.
''ఈ బిల్లులు పార్లమెంటు ఆమోదించిన చట్టానికి వ్యతిరేకం. వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి'' అని అంటున్నారు. రాజ్‌భవన్ ఈ విషయంపైనే ఎక్కువగా దృష్టిసారించినట్లు తెలిసింది. అసలు ఈ చట్టాలు చే సే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా? అన్న దానిపై కూడా గవర్నర్ న్యాయ సలహా అడిగారని తెలిసింది. రెండు మూడురోజుల్లో న్యాయ విభాగం దీనిపై తన అభిప్రాయం తెలిపే అవకాశముంది.

0 Comments:
Post a Comment