అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రభుత్వ ఉపాధ్యాయులు బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాలు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు రాష్ట్రప్రభుత్వం తాజాగా సోమవారం ఆన్ లైన్ బోధనకు సంబంధించిన మార్గదర్శకాలు కొత్త సందేహాలకు తెరతీశాయి.
కరోనా కారణంగా ఏపీలో విద్యా సంవత్సరం ప్రారంభంపై అయోమయం నెలకొంది. కరోనా వ్యాప్తికి కారణమవుతుందనే ఉద్దేశంతో పదో తరగతితోపాటు ఇంటర్ పరీక్షలు కూడా రద్దుచేసి ఇంటర్నల్, ఫ్రీ పబ్లిక్ మార్క్స్ ఆధారంగా పాస్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
చివరికి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దుచేసింది. ప్రతి ఏటా జూన్‌లో విద్యా సంవత్సరం ఎప్పుడూ ప్రారంభమవుతుంది. ఈసారి కరోనా ప్రభావంతో స్కూల్స్ రీ ఓపినింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్ లైన్ క్లాస్, ఆఫ్ లైన్ క్లాస్‌ల ద్వారా విద్యార్థులతో టచ్‌లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సోమవారం ఒక సర్క్యూలర్‌ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పని దినాలు కుదించడమే కాకుండా జులై 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలల్లో వారానికి ఒక రోజు, ప్రాథమికొన్నత పాఠశాలల్లో వారానికి రెండు రోజులు పని చేసేలా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 10లోపు ఉపాధ్యాయులు డేటాను అప్‌డేట్ చేయాలని సూచించారు.
0 Comments:
Post a Comment