In a statement, BV Venkatesan, Director (Evaluation) of the National Universal School (NIOS) said that all exams of secondary and senior secondary courses have been canceled. They were postponed to July 17 in the wake of the Corona outbreak, when tests were due to begin in March. It was decided that the epidemic would be canceled due to the absence of the pandemic.
గత పరీక్షల ఫలితాల ఆధారంగా మూల్యాంకనం
సెకండరీ, సీనియర్ సెకండరీ కోర్సుల పరీక్షలన్నింటిని రద్దు చేసినట్లు జాతీయ సార్వత్రిక పాఠశాల సంస్థ (ఎన్‌ఐఓఎస్) డైరెక్టర్ (ఎవాల్యుయేషన్) బి.వెంకటేషన్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చిలో పరీక్షలు ప్రారంభం కావల్సి ఉండగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటిని జులై 17కి వాయిదా వేశారు. ఇప్పట్లో మహమ్మారి అదుపులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయించారు. గతంలో ఆయా అభ్యర్థులు రాసిన పరీక్షల్లోని మార్కులను ఆధారంగా చేసుకొని వారిని ఉన్నత తరగతులకు పంపనున్నారు. నాలుగు సబ్జెక్టులు రాసిన వారికి మెరుగైన మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల మార్కులను, మూడు సబ్జెక్టులు రాసిన వారికి రెండింటిని, రెండు, ఒకటి సబ్జెక్టుల పరీక్షలు రాసిన అభ్యర్థుల విషయంలో థియరీలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
పరీక్షలు రాయని వారు, మొదటి సారి కోర్సుల్లో ప్రవేశించిన వారి విషయంలో ట్యూటర్ల మార్కులు, ఏవైనా ప్రాక్టికల్స్‌కు హాజరైతే వాటి మార్కులను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

0 Comments:
Post a Comment