దక్షిణ కొరియా నిపుణులు COVID-19 బంధువుల నుంచే వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇంటి చుట్టు పక్కల వారు, తెలిసిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ).. యూఎస్ సెంటర్స్ లో జులై 16న పబ్లిష్ అయింది. 5వేల 706మంది పేషెంట్లపై చేసిన స్టడీలో వారు 59వేల మందికి పైగా వైరస్ వ్యాప్తి చేసినట్లు తెలిసింది.
ఇందులో 2/100మంది పరిచయాలు లేనివారు, దూరపు మనుషులు కాగా 10/100 మంది సొంత కుటుంబాల వ్యక్తులు, దగ్గరి వ్యక్తులేనని తేలింది. ఏజ్ గ్రూప్ దృష్ట్యా ఇన్ఫెక్షన్ రేట్ ఇంటి సభ్యుల్లో టీనేజర్లలో లేదంటే 60-70సంవత్సరాల మధ్య ఉన్నవారికి సోకినట్లు తెలుస్తుంది.
లాక్ డౌన్ ఎత్తేయడంతో పండుగలు, సెలబ్రేషన్స్ అంటూ ఇంట్లోనే ఉంటున్నారు కదా అని బంధువులపై నమ్మకంతో వారి ఇళ్లకు వెళుతున్నాం.
ఇలా వచ్చిన వారిలో ఎవరికి ఉన్నా.. గ్రూపుగా ఫామ్ అవడంతో వైరస్ ఇట్టే వ్యాపిస్తుంది. 'ఈ ఏజ్ గ్రూపులు వారు కుటుంబ సభ్యులతో క్లోజ్ గా ఉంటున్నారు. వీరికి ప్రొటెక్షన్ తో పాటు సపోర్ట్ కూడా చాలా అవసరం' అని జియోంగ్ యున్ కియోంగ్ అంటున్నారు. వైరస్ సోకిన వ్యక్తుల్లో 9సంవత్సరాల లోపు వయస్సున్న వాళ్లు చాలా తక్కువగా ఉన్నారు.
యుక్త వయస్సు వచ్చిన వారి కంటే పిల్లల్లోనే COVID-19ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సార్లు వయస్సుతో కూడా సంబంధం లేదు. పిల్లలు వైరస్ వ్యాప్తి చేయడంలో తక్కువగానే ఉంటున్నారు. ఎందుకంటే వారి ఇమ్యూనిటీ స్థాయి పోరాడలేక ముందుగానే లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ స్టడీ జనవరి 20నుంచి మార్చి 27వరకూ జరిగింది.
0 Comments:
Post a Comment