ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త టెక్నాలజీలను కూడా వాట్సాప్.. వినియోగదారుల ముందుకు తీసుకొస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వాడని వారు దాదాపు లేరనే చెప్పాలి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా వాట్సాప్‌ను వినియోగిస్తూనే ఉన్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లలు సైతం వాట్సాప్‌ని వాడుతున్నారు. అందులోనూ లాక్‌డౌన్ తర్వాత దీని వినియోగం మరింత పెరిగింది. రోజూ పొద్దున్న లేవగానే.. వాట్సాప్ చూడటం అందరికీ సర్వసాధరణం అయిపోయింది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇటీవలే గూగుల్, ఫోన్‌పేలాగే..
బ్యాంకింగ్ సంబంధిత సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.
ఇన్ని ఫీచర్స్‌ని అందిస్తోన్న వాట్సాప్.. ఇప్పుడు మరికొన్ని సేవలను కూడా అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే తన సేవలను మరింత విస్తరించనుంది వాట్సాప్. బీమా, మైక్రో ఫైనాన్స్, పెన్షన్ వంటి సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం బ్యాంకులతో వాట్సాప్ భాగస్వామ్యం కుదుర్చుకోగా, ఆర్‌బీఐ నుంచి కూడా అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు గ్రామీణ ప్రాంతాలకు తమ సేవలను విస్తరించేందకు గ్రామీణ బ్యాంకులతో కూడా కలిసి పనిచేయబోతున్నామని చెబుతోంది వాట్సాప్ సంస్థ.
0 Comments:
Post a Comment