అమరావతి: కొవిడ్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి జిల్లాలో కొవిడ్ ఆసుపత్రుల్లో పడకల ఖాళీలు, భర్తీ వివరాలు ప్రదర్శించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పదివేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా నివారణపై సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ అధికారులు హాజరయ్యారు.
కరోనా నివారణపై తీసుకోవాల్సిన చర్యల గురించి జగన్ అధికారులతో సమీక్షించారు. ప్లాస్మా వలన ప్రయోజనం ఉందనుకుంటే ప్రోత్సహించాలని జగన్ అధికారులకు తెలిపారు. ప్లాస్మా దాతలకు రూ. 5వేలు ప్రోత్సాహక సాయం అందించాలని జగన్ తెలిపారు. స్కూళ్ళు తెరిచే నాటికి విద్యాకానుకతో పాటు ప్రతి పిల్లాడికి మాస్కులు అందించాలని అధికారులకు సూచించారు.
ఇక మూడేళ్ళలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. కరోనా బెడ్ల సమాచారం ఆసుపత్రుల హెల్ప్ డెస్క్ లో ఉంచాలని, ఏదైనా ఆసుపత్రిలో బెడ్స్ లేకుంటే సమీపంలోని ఆసుపత్రిలో కేటాయించాలని జగన్ తెలిపారు. కురిచేడు మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సమీక్షా సమావేశంలో జగన్ పేర్కొన్నారు.
''ఆసుపత్రి హెల్ప్‌లైన్ నంబర్ సహా పడకల ఖాళీ వివరాలు బ్లాక్‌బోర్డుపై రాయాలి. ఎవరికైనా బెడ్ అందుబాటులో లేదంటే సమీప ఆసుపత్రిలో బెడ్ కేటాయించాలి. రోగులకు ఆసుపత్రిలో బెడ్ దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు. హెల్ప్ డెస్క్‌లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కొవిడ్ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
హెల్ప్ డెస్క్ ప్రభావవంతంగా పనిచేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, ఆహారం, శానిటైజేషన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జీజీహెచ్ లాంటి ఆసుపత్రులు మరింత దృష్టి పెట్టాలి. దీనిపై సంయుక్త కలెక్టర్లు దృష్టి పెట్టాలి.కొవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం చేపట్టండి'' అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

0 comments:
Post a comment