అమరావతి: రాష్ట్రంలో ఆంగ్రమాధ్యమ విద్యకు కట్టుబడి ఉన్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. నూతన విద్యా విధానంపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘‘తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా అమలుచేస్తాం. రాష్ట్రంలో తెలుగు మాధ్యమ పాఠశాలలనూ ఏర్పాటు చేస్తున్నాం. ఏడాదిగా రాష్ట్రంలో చేసిన మార్పులను కేంద్రానికి తెలిపాం. కేంద్ర ముసాయిదాలోని పలు అంశాలు ఇప్పటికే రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. ఆంగ్లమాధ్యమంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఆంగ్లమాధ్యమ అమలును అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సురేశ్ అన్నారు.
ఆంగ్లమాధ్యమ విద్యకు కట్టుబడి ఉన్నాం: సురేశ్

0 comments:
Post a comment