Do you have a bank account? Do you check your bank statement frequently? Osari See your statement. It contains details of charges levied by banks on you. You will not receive SMS on every transaction that takes place in your account. Especially if the banks charge any fees, you will get those messages less. And you need to check the statement to know what charges have been levied on you. Banks do not provide all services for free. Some services only come to you for free. You will have to pay for other services. Find out more about the fees that banks charge you.
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మీ బ్యాంక్ స్టేట్మెంట్ తరచూ చెక్ చేస్తుంటారా? ఓసారి మీ స్టేట్మెంట్ చూడండి. అందులో బ్యాంకులు మీ నుంచి వసూలు చేసిన ఛార్జీల వివరాలుంటాయి. మీ అకౌంట్లో జరిగే ప్రతీ లావాదేవీపై మీకు ఎస్ఎంఎస్లు రావు. ముఖ్యంగా బ్యాంకులు ఏవైనా ఛార్జీలు వసూలు చేస్తే ఆ మెసేజ్‌లు మీరు తక్కువగా వస్తుంటాయి. మరి మీకు ఏఏ ఛార్జీలు వేసిందో తెలుసుకోవాలంటే స్టేట్మెంట్ చెక్ చేయాల్సిందే. బ్యాంకులు అన్ని సేవల్ని ఉచితంగా అందించవు. కొన్ని సేవలు మాత్రమే మీకు ఫ్రీగా వస్తాయి. మిగతా సర్వీసులకు మీరు ఛార్జీలు చెల్లించాల్సిందే. మరి బ్యాంకులు బ్యాంకులు మీ నుంచి వసూలు చేసే ఛార్జీల వివరాలు తెలుసుకోండి.
Minimum Balance: మీరు మీ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఓపెన్ చేసిన అకౌంట్, మీ బ్రాంచ్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టైతే మెట్రో, అర్బన్ బ్రాంచుల్లో రూ.10,000, సెమీ అర్బన్, రూరల్ బ్రాంచ్‌లల్లో రూ.5,000 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ యావరేజ్ మినిమమ్ బ్యాలెన్స్ రూ.7500 నుంచి రూ.10000 మధ్య ఉంటే బ్యాంకు రూ.150+పన్నుల్ని పెనాల్టీగా వసూలు చేస్తుంది. యావరేజ్ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5000 నుంచి రూ.7500 మధ్య ఉంటే బ్యాంకు రూ.300+పన్నుల్ని పెనాల్టీగా వసూలు చేస్తుంది. ఇలా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ లేదా యావరేజ్ మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి.
Debit card fees: మీ అకౌంట్‌కు డెబిట్ కార్డు ఉంటుంది కదా? ఆ కార్డుకు కూడా ఛార్జీలు చెల్లించాలి. కొన్ని సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమే ఉచితంగా డెబిట్ కార్డులు వస్తాయి. రకరకాల డెబిట్ కార్డులు ఉంటాయి. కార్డును బట్టి ఛార్జీలు ఉంటాయి. ఎక్కువ ఫీచర్లు ఉన్న డెబిట్ కార్డు తీసుకుంటే ఎక్కువ ఛార్జీలు చెల్లించాలి. ఈ ఛార్జీలు రూ.99 నుంచి రూ.750 మధ్య ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రెగ్యులర్ కార్డుకు రూ.150, ప్లాటినమ్ డెబిట్ కార్డుకు రూ.750 వసూలు చేస్తుంది. ఒకవేళ మీ కార్డు ఎక్కడైనా పోతే కొత్త కార్డు కోసం రూ.200 చెల్లించాలి.
Money Transfer Charges: మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్-NEFT, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్-RTGS లాంటి పద్ధతుల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ వీటికీ ఛార్జీలుంటాయి. మీరు బ్యాంక్ బ్రాంచ్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఛార్జీలు చెల్లించాలి. నెఫ్ట్ ఛార్జీలు రూ.1 నుంచి రూ.25+జీఎస్టీ, ఆర్టీజీఎస్కు రూ.5 నుంచి రూ.50+జీఎస్టీ, ఐఎంపీఎస్‌కు రూ.1 నుంచి రూ.15+జీఎస్టీ చొప్పున ఛార్జీలు చెల్లించాలి. ఆన్లైన్ లావాదేవీలన్నీ ఉచితమే.
ప్రతీకాత్మక చిత్రం
ATM transaction charges: మీరు ఏటీఎంలో మీకు ఇచ్చిన లిమిట్ కన్నా ఎక్కువసార్లు డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించక తప్పదు. సాధారణంగా బ్యాంకులు తమ బ్రాంచ్ ఏటీఎంలల్లో 5 సార్లు, ఇతర బ్యాంకు ఏటీఎంలల్లో 3 సార్లు ఉచితంగా డబ్బులు డ్రా చేయొచ్చు. ఈ లిమిట్ కన్నా ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేస్తే రూ.20 నుంచి రూ.50 మధ్య ప్రతీ లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి.
Duplicate statement charges: బ్యాంకులు ఏడాదికి ఓసారి యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్ కాపీని ట్యాక్స్ ఫైలింగ్ కోసం ఉచితంగా ఇస్తాయి. మీకు డూప్లికేట్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలంటే రూ.50 నుంచి రూ.100 మధ్య ఛార్జీలు చెల్లించాలి. లేదా ప్రతీ పేజీకి రూ.10 చొప్పున చెల్లించాలి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేస్తే ఛార్జీలు తక్కువ ఉంటాయి.
Failed ECS transaction: మీరు ఏవైనా లావాదేవీలకు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్-ECS ఉపయోగిస్తున్నారా? ఒకవేళ ఈసీఎస్ పేమెంట్ ఫెయిల్ అయితే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. సాధారణంగా తక్కువ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఈసీఎస్ పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఈసీఎస్ పేమెంట్ ఫెయిల్ అయిన ప్రతీసారి ఛార్జీలు చెల్లించక తప్పదు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.500+జీఎస్టీ పెనాల్టీ వసూలు చేస్తుంది. ఈ పెనాల్టీ వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటుంది.
Cash transactions: మీ సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్‌కు లిమిట్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువసార్లు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఛార్జీలు తప్పవు. కొటక్ మహీంద్రా బ్యాంకులో నెలకు నాలుగు సార్లు ఉచితంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఈ లిమిట్ దాటితే రూ.1,000 కి రూ.3.5 చొప్పున చెల్లించాలి.
Other charges: ఇవే కాదు... వీటితో పాటు చెక్ బౌన్స్, ఎస్ఎంఎస్ సర్వీస్ ఫీజ్, అకౌంట్ క్లోజర్, ఔట్ స్టేషన్ చెక్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, కొత్త చెక్ బుక్, డిమాండ్ డ్రాఫ్ట్స్, రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్, లాకర్ రెంట్, పిన్ రీజెనరేషన్ లాంటి ఛార్జీలు కూడా ఉంటాయి.
ఈ ఛార్జీలు తక్కువగా అనిపించినా మీరు ఒక ఏడాదిలో ఎన్ని ఛార్జీలు, పెనాల్టీలు చెల్లించారో లెక్కేస్తే ఎక్కువ మొత్తం ఉంటుంది. అందుకే మీ ఏడాది స్టేట్మెంట్ చెక్ చేసి ఏఏ ఛార్జీలు, పెనాల్టీలు చెల్లించారో, భవిష్యత్తులో ఆ ఛార్జీలను ఎలా తప్పించుకోవచ్చో ప్లాన్ చేయండి.

0 comments:
Post a comment