What can we do about EAMCET?
Doubts emanating from the candidates
Ambiguity over the test at centers in Hyderabad
Quarantines in 23 examination center colleges in the state
Meeting with joint entrance exam conveners today
ఎంసెట్‌పై ఏం చేద్దాం?
అభ్యర్థుల నుంచి వెల్లువెత్తుతున్న సందేహాలు
హైదరాబాద్‌లోని కేంద్రాల్లో పరీక్షపై సందిగ్ధం
రాష్ట్రంలో 23 పరీక్ష కేంద్రాల కళాశాలల్లో క్వారంటైన్లు
నేడు ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం
మా సోదరుడు కరోనా బారిన పడ్డారు. కుటుంబ సభ్యులందర్నీ క్వారంటైన్లో పెట్టారు. ఎంసెట్‌కు ఎలా హాజరు కావాలి?
అధికారులకు ఓ విద్యార్థి ఈ-మెయిల్
నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. పరీక్షకు హాజరు కావచ్చా
మరో విద్యార్థి అనుమానం
జులైలో ఎంసెట్ ఉంటుందా.. లేదా?
సహాయ కేంద్రానికి అభ్యర్థుల ఫోన్ల వెల్లువ
కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి సహాయ కేంద్రానికి ఫోన్లు, అధికారులకు ఈ-మెయిళ్లు హోరెత్తుతున్నాయి. ఎంసెట్‌ను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో విద్యార్థుల నుంచి అనేక సందేహాలు వస్తున్నాయి. దీంతో ఎంసెట్ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో శనివారం మరోసారి మంత్రి సురేష్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి సమావేశం నిర్వహిస్తారు.
మారిన పరీక్ష కేంద్రాల ఎంపికలు
ఏపీ ఎంసెట్‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 2.71 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరికి మొదట 167 పరీక్ష కేంద్రాలను కేటాయించగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 146కు తగ్గింది. విద్యాసంస్థలు మూతపడటంతో విజయవాడలో ఇంటర్ చదివిన చాలామంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించడంతో విజయవాడకు బదులు సొంత జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. దీంతో విజయవాడలో పరీక్ష కేంద్రాల సంఖ్య తగ్గి, జిల్లాల్లో పెరిగింది. సుమారు 15 వేల మంది ఇలా మార్చుకున్నారు.
అక్కడ పరీక్ష ఎలా?
రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష కేంద్రాలుగా ఉన్న 23 కళాశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్నాయి. ఇటీవలే ఒంగోలులో ఒక కళాశాలను క్వారంటైన్ కేంద్రంగా మార్చారు. దీంతో వాటి విషయంలో ఏం చేయాలనే దానిపైనా స్పష్టత లేదు. పరీక్షలకు దాదాపు 1,100 మంది వరకు ఇన్విజిలేటర్లు, ఇంకా పర్యవేక్షకులు అవసరం. మరోవైపు.. తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు సుమారు 22 వేల మంది దరఖాస్తు చేశారు. వీరికి హైదరాబాద్‌లో 4 కేంద్రాలను కేటాయించారు. ఇప్పటివరకు ఈ కేంద్రాలను కన్వీనర్, ఇతర అధికారులు పరిశీలించలేదు. హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున అక్కడ పరీక్ష ఎలా నిర్వహించాలనే దానిపైనా సందిగ్ధత నెలకొంది.

Edo okati confirm ga cheppandra baabu andaru depression loki veltunnaru
ReplyDeleteEmcet exam vunda lada
ReplyDeleteఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా... విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయగలరా... ప్రభుత్వ అధికారులు దీనిపై వీలైనంత తొందరగా ఒక నిర్ణయం ప్రకటించాలని ఆశిస్తున్నాం
ReplyDelete