ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రత్యేకంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్-APCOS వెబ్‌సైట్ ప్రారంభించింది. దళారులు, బ్రోకర్లు, లంచాలు, రికమండేషన్ల ప్రమేయం లేకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 100 శాతం పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తాయి. నిరుద్యోగులు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకోండి.
ముందుగా http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
త్వరలో Candidates Registration ప్రాసెస్ మొదలవుతుంది. Candidates Registration పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు ఎంటర్ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు కనిపిస్తాయి. వాటికి దరఖాస్తు చేయాలి. మీ వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని దరఖాస్తు సబ్మిట్ చేయాలి. మీ దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం, బీసీలు, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున రిజర్వేషన్లు ఉంటాయి.
ఇప్పటికే ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందర్నీ ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్‌లోకి చేర్చింది ప్రభుత్వం. వారందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి సదుపాయాలన్నీ వస్తాయి. ఇకపై వారందరికీ జీతాలు ఈ కార్పోరేషన్ నుంచే వస్తాయి.
Very good for unemployment
ReplyDeleteSend to link in regestaction
ReplyDelete2 times e news pettaru but link not opened till now...
ReplyDeleteRegistration link send cheyyandi
ReplyDeletePlz send registration link
ReplyDelete